జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన బొమ్మబోయిన శ్రీనివాస్ గౌడ్ అలాగే గల్ఫ్ బాట పట్టి నిట్టనిలువునా మోసపోయాడు. ‘పొన్నం సాగర్ అనే వ్యక్తి పనిలో పెట్టిస్తా అని తీసుకొచ్చి, దుబాయ్‌లో నిర్భంధించాడు. బ్లాక్ మెయిల్ చేసి నా పేరుతో లోన్లు తీసుకున్నారు. పాకిస్థాన్ వాళ్లతో కలిసి నన్ను మోసం చేశాడు. సర్వారెడ్డిపల్లెలోని క్వారీలో పనిచేసే నన్ను దేశం కాని దేశం తీసుకొచ్చి నరకం చూపిస్తున్నాడు. పాస్‌పోర్టు లాక్కొని ఎటూ వెళ్లరాకుండా చేశాడు. ఇంటి నుంచి డబ్బులు పంపిస్తే ఆ డబ్బుతోనే అవసరాలు తీర్చుకుంటున్నా’ అని ఇదివరకే బాధితుడు వెల్లడించాడు.
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ బాట పట్టి ఏజెంట్ల చేతిలో మోసపోతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంచి పని ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లి.. అక్కడికి వెళ్లాక నరకం చూపిస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన బొమ్మబోయిన శ్రీనివాస్ గౌడ్ అలాగే గల్ఫ్ బాట పట్టి నిట్టనిలువునా మోసపోయాడు. ‘పొన్నం సాగర్ అనే వ్యక్తి పనిలో పెట్టిస్తా అని తీసుకొచ్చి, దుబాయ్‌లో నిర్భంధించాడు. బ్లాక్ మెయిల్ చేసి నా పేరుతో లోన్లు తీసుకున్నారు. పాకిస్థాన్ వాళ్లతో కలిసి నన్ను మోసం చేశాడు. సర్వారెడ్డిపల్లెలోని క్వారీలో పనిచేసే నన్ను దేశం కాని దేశం తీసుకొచ్చి నరకం చూపిస్తున్నాడు. పాస్‌పోర్టు లాక్కొని ఎటూ వెళ్లరాకుండా చేశాడు. ఇంటి నుంచి డబ్బులు పంపిస్తే ఆ డబ్బుతోనే అవసరాలు తీర్చుకుంటున్నా’ అని ఇదివరకే బాధితుడు వెల్లడించాడు.
అయితే, ఎట్టకేలకు బాధితుడి సోదరుడు బొమ్మబోయిన రవి తన తమ్ముడిని తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. దీంతో బాధితుడు శ్రీనివాస్ గౌడ్ స్వదేశం చేరాడు. తన అన్న లేకపోయుంటే తాను దుబాయ్‌లోనే చనిపోయుండేవాడినని, తన భార్య, కుమారుడి ఏమైపోయుండేవారోనని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ‘నాలాంటి బాధితులు చాలా మంది గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్నారు. దుబాయ్ వెళ్లాక రూమ్స్‌లో బంధించి నా సంతకం తీసుకొని, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు, లోన్లు తీసుకున్నారు. ఆ డబ్బుతో జల్సాలు చేసేవాళ్లు. పాస్ పోర్టు లాక్కొని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నాలాంటి వాళ్లు అక్కడ 60 మంది వరకు ఉన్నారు. నా అన్న రవి లేకుంటే నేను ఈ రోజు బతికి ఉండేవాడినే కాదు. ఇండియన్ ఎంబసీతో మాట్లాడి నన్ను ఇంటికి చేర్చేలా తీవ్రంగా కష్టపడ్డాడు. నా ఈ ప్రాణం నా అన్న పెట్టిన భిక్ష. నా అన్న రుణం తీర్చుకోలేను. సంవత్సరం పాటు నరకం అనుభవించా. ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నా. నాకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. ఏజెంట్ తన కుటుంబాన్ని చంపే కుట్రలు చేస్తున్నారని బాధితుడు వాపోతున్నాడు.
తనకు ఏదైనా ప్రాణాపాయం ఉంటే అందుకు పొన్నం సాగరే బాధ్యుడు అని వెల్లడించాడు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు.