Jagtial News | రైల్వే గేటు మరమ్మతులో భాగంగా పూడూరు రైల్వే గేటును పది రోజుల పాటు మూసివేయనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు, జగిత్యాల జిల్లా: రైల్వే గేటు మరమ్మతులో భాగంగా పూడూరు రైల్వే గేటును పది రోజుల పాటు మూసివేయనున్నారు. ‘పూడూర్ రైల్వే గేటు మరమ్మతులో భాగంగా సోమవారం (27.05.2024) నుండి బుధవారం (05.06.2024) వరకు గేట్ మూసి వేసి ఉంటుంది. కావున ప్రయాణికులు తమ రాకపోకలను చెప్యాల x రోడ్డు నుండి దొంగమర్రి రోడ్డు గుండా పూడూర్, కొడిమ్యాలకు చేరుకోగలరు’ అని ప్రజలకు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ప్రకటన విడుదల చేశారు.