రేవంత్‌రెడ్డి, అందెశ్రీ మోసం చేశారు.. జగిత్యాల జిల్లా సంగీత దర్శకుడి ఆవేదన

జయ జయహే తెలంగాణ పాట విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అందెశ్రీ మోసం చేశారని జగిత్యాల జిల్లాకు చెందిన సంగీత దర్శకుడు ఎస్వీ మల్లిక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు.

mallik tej

సంగీత దర్శకుడు మల్లిక్ తేజ

జగిత్యాల జిల్లా, ఈవార్తలు: జయ జయహే తెలంగాణ పాట విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అందెశ్రీ మోసం చేశారని జగిత్యాల జిల్లాకు చెందిన సంగీత దర్శకుడు ఎస్వీ మల్లిక్ తేజ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సరిగ్గా సంవత్సరంన్నర క్రితం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క నన్ను కలిసి జయ జయహే తెలంగాణ పాటను సంగీతం సమకూర్చాలని కోరటంతో పాట మీద, అందెశ్రీ అన్న ఉన్న గౌరవంతో ఎలాంటి స్వలాభం ఆశించకుండా, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పాట చేశాను. అప్పుడున్న పరిమితమైన బడ్జెట్‌లోనే పాట రూపకల్పన చేసి ఇచ్చాను’ అని వెల్లడించారు.

అయితే, భవిష్యత్తులో ఈ పాటను ఉన్నత ప్రమాణాలతో రూపొందించే అవకాశాన్ని తనకే కల్పిస్తానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని గుర్తుచేస్తూ ఆవేదన వెల్లగక్కారు. ‘నేను పాటకు సంగీతం అందించాక కవి అందెశ్రీ అన్న కూడా పాట విని అద్భుతంగా చేసావు. మహిళల బృందగానం బాగుంది. ఈ పాటను మళ్లీ అద్భుతంగా చేసే అవకాశం వచ్చినప్పుడు నువ్వే చేస్తావు. మనమే కలిసి పని చేస్తాం అని చాలా సార్లు నాతో అన్నారు. ఇప్పుడేమో ప్రభుత్వం వచ్చి, కావాల్సినంత బడ్జెట్ వాళ్లకు ఉంది. వాళ్లు ఇచ్చిన మాట ప్రకారం మాలాంటి అవకాశం ఇస్తే మరింత ప్రేమతో పనిచేసేవాళ్లం కదా’ అని నిట్టూర్చారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్