జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల : బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోగా, తాజాగా.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ గూటికి చేరారు. అయితే, కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన నేతగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం షాకింగ్‌కు గురిచేస్తోంది. బీఆర్ఎస్‌లో మొత్తం మంది ఎమ్మెల్యేలు.. పార్టీ మారినా, చివరి వరకు కేసీఆర్ వెంటే ఉంటారనుకున్న సంజయ్ కుమారే ముందుగా వేరే పార్టీలోకి జంప్ కావటం జగిత్యాల సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది.