తీరుమారని గురుకులాలు.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతర్

గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో విద్యార్థులకు అందించే భోజనంలోనూ పురుగులు ప్రత్యక్షం కావడం గమనార్హం.

upma gurukula
ఉప్మాలో పురుగులు

మహబూబ్‌నగర్, ఈవార్తలు : గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో విద్యార్థులకు అందించే భోజనంలోనూ పురుగులు ప్రత్యక్షం కావడం గమనార్హం. ఈ రోజు ఉదయం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఇచ్చిన ఉప్మాలో పురుగులు వచ్చాయి. అది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగారు. అయితే, గురుకులంలో మధ్యాహ్న భోజన ఘటనపై నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. 

ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలపై వెంటనే విచారణ జరిపి, తనకు నివేదికను అందజేయాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే, సీఎం ఆదేశించిన తెల్లవారే.. అదే విద్యార్థులకే ఆస్పత్రిలో పురుగుల టిఫిన్ పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం విద్యార్థుల ఆహారం, ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ ఇదేనా? అని మండిపడుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్