కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ స్థలాల వేలంపాటలో భాగంగా వేలంపాటను అడ్డుకుంటామన్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి, ఈవార్తలు : కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ స్థలాల వేలంపాటలో భాగంగా వేలంపాటను అడ్డుకుంటామన్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ బోర్డ్ స్థలాలు ఇప్పటికే 24 ఫ్లాట్లను వేలం వేస్తున్నట్లుగా ప్రకటించారు. అందులో రెండు ప్లాట్లు 2008 సంవత్సరంలో హెచ్ఎండిఏ 200 ఫీట్ల రోడ్డుగా నిర్ధారించింది. అదే రోడ్డును హౌసింగ్ బోర్డ్ అధికారులు 80 ఫీట్ల రోడ్డుగా చూపుతూ వేలం నిర్వహిస్తున్నారని, వేలంలో ఆ రెండు ఫ్లాట్ లను కొనుగోలు చేసిన వారు నష్టపోతారని వాటిని ఎట్టి పరిస్థితుల్లో వేలం వెయ్యోద్దని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేస్తున్నారు.
వేలంలో కొనుక్కున్న వాళ్లు 200 ఫీట్ల రోడ్డు విస్తరణలో తమ ప్లాట్లను నష్టపోతారని, ఆ రెండు ఫ్లాట్ల వేలాన్ని నిలిపివేయకపోతే వేలం పాటను అడ్డుకుంటానని మాధవరం కృష్ణారావు అన్నారు. అయినా వేలం వేస్తామని హౌసింగ్ బోర్డు అధికారులు ముందుకే వెళ్తున్నారు. ఉదయం 10:30కు వేలం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే, ప్రజలకు అన్యాయం చేస్తూ వేలం వేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కృష్ణారావు ఫిర్యాదు చేశారు.