మహాశివరాత్రి జాతరను ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్‌లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రaాతో కలిసి జాతర సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా, జనవరి 8 (ఋషి ప్రతినిధి): మహాశివరాత్రి జాతరను ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్‌లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రaాతో కలిసి జాతర సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు 3 రోజుల పాటు జరిగే వేడుకలపై రివ్యూ నిర్వహించారు. అదనపు బస్సులు, పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్డు నిర్వహణ, దేవాలయం వద్ద వసతి సౌకర్యం, తాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్ ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం, కల్యాణ కట్ట, ధర్మ గుండం, బద్దిపోచమ్మ ఆలయం, హెల్ప్ సెంటర్, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేసుకున్న ప్రణాళికను సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాలని, నిర్దేశించుకున్న పనులు జాతర సమయానికి పూర్తయ్యేలా వేగవంతం చేయాలని ఆదేశించారు. గత ఏడాది 2.50 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈసారి 4 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని, ఆ స్థాయిలో జాతర ఏర్పాట్లు చేయాలని అన్నారు.
భక్తులకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ ప్యాకెట్లు, పాలు అందించేలా దేవస్థాన సంస్థ ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్యూ లైన్లలో చేరిన భక్తులకు దర్శనం కోసం అధిక సమయం పడుతుందని.. వారికి పాలు అందించేలా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రధాన ఆలయంలోకి వచ్చేముందే అవసరమైన మేర టాయిలెట్స్ ఏర్పాట్లు చేయాలని, ప్రతి 15 నిమిషాలకోసారి వాటిని శుభ్రం చేసేలా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని వెల్లడిరచారు. ధర్మగుండం వద్ద గజ ఈత గాళ్లను ఏర్పాటు చేయాలని, నీటిని నిరంతరం మార్చుతూ ఉండాలని తెలిపారు. జాతర సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని, ఫోన్ సిగ్నల్స్ సమస్య రాకుండా.. తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేయించేలా చూడాలని సూచించారు. ఆ మూడు రోజులు వేములవాడకు గతం కంటే 30% అధికంగా బస్సు సర్వీసులు నడపాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి, ఈ.ఓ వినోద్ రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వేములవాడ ఆలయం ప్రధాన అర్చకులు భీమ శంకర శర్మ , మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ప్రజా ప్రతినిధులు సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
లడ్డూ తయారీ కేంద్రం తనిఖీ
రాజన్న ఆలయంలోని లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ రaా బుధవారం తనిఖీ చేశారు. జాతర సమన్వయ సమావేశం అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారిని ఆలయ ఈవో వినోద్ రెడ్డి శాలువాతో సన్మానించి, స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఆ తర్వాత విప్, కలెక్టర్.. లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. స్టోర్ రూం, లడ్డూ తయారీకి వినియోగించే పదార్థాలు, నెయ్యి, తయారీ విధానం, పరిసరాలు తనిఖీ చేశారు. రోజు ఎంత నెయ్యి వినియోగిస్తున్నారు? ప్రతి రోజు ఎన్ని లడ్డూలు సిద్ధం చేస్తారు? ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారు? అని ఆరా తీశారు. లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని ఆధునీకరించాలని సూచించారు.