రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే ఆయా మార్గాల గుండా ప్రయాణించే ప్రత్యేక రైళ్లకు అదనపు కోచ్ లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల శబరిమల వెళ్లే భక్తుల కోసం 62 ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా తిరుపతి వెళ్లే భక్తుల కోసం రెండు వీక్లీ స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
వందే భారత్ రైలు
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే ఆయా మార్గాల గుండా ప్రయాణించే ప్రత్యేక రైళ్లకు అదనపు కోచ్ లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల శబరిమల వెళ్లే భక్తుల కోసం 62 ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా తిరుపతి వెళ్లే భక్తుల కోసం రెండు వీక్లీ స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ వందే భారత్ రైళ్లకు అదనపు కోచులను ఏర్పాటు చేయనుంది. హిసార్ - తిరుపతి వీక్లీ స్పెషల్ డిసెంబర్ ఏడో తేదీ నుంచి 17 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ రైలు ప్రతి శనివారం హిసార్ లో బయలుదేరి మరుసటి రోజు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి - హిసార్ వీక్లీ స్పెషల్ డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ వరకు నడుస్తోంది. ఈ రైలు ప్రతి సోమవారం తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు హిసార్ చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్, కాగజ్నగర్ రైల్వే స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే
అధికారులు ఒక ప్రకటనలో కోరారు. అలాగే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్ లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ రైలు ఎనిమిది కోచులతో నడుస్తుండగా.. మరో ఎనిమిది బోగీలు జతచేయనున్నారు. సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే మరో వందే భారత్ రైలు ప్రస్తుతం 16 భోగిలతో నడుస్తుండగా.. దీనికి మరో నాలుగు భోగీలు జతచేయనున్నారు. మరోవైపు విశాఖ - కిరండోల్ ప్యాసింజర్ స్పెషల్ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ పెంచనున్నారు. డిసెంబర్ 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, జనవరి ఒకటి తేదీల్లో ఒక థర్డ్ ఏసి ఎకానమీ క్లాస్ ను జత చేయనున్నారు. కిరండూల్ - విశాఖ ప్యాసింజర్ స్పెషల్ రైలుకు డిసెంబర్ రెండో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ఒక స్లేపర్ క్లాస్ భోగిని పెంచనున్నారు. డిసెంబర్ 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, జనవరి 2 తేదీల్లో ఒక థర్డ్ ఏసి ఎకానమీ కోచ్ చేస్తారు. మరోవైపు డిసెంబర్ లో గుంతకల్ డివిజన్లోని భద్రతా పనులు జరగనున్నాయి. ఈ క్రమంలో రైళ్ళను నంద్యాల - ధోనే - అనంతపురం సాధారణ రూటుకు బదులుగా నంద్యాల - ఎర్రగుంట్ల - గూటి - అనంతపురం మీదుగా దారి మళ్ళించనున్నారు. ఈ విషయంలో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని, అదనపు కోచుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు వెల్లడించారు.