Badrachalam | భద్రాచలంలో హై అలర్ట్.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దిగువ పోలవరానికి 8,85,224 క్యూసెక్యుల నీటిని విడుదల చేశారు.

badrachalam

భద్రాచలంలో వరద ఉధృతి

భద్రాచలం, ఈవార్తలు : భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దిగువ పోలవరానికి 8,85,224 క్యూసెక్యుల నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలంలో ప్రస్తుతం 43 అడుగులకు నీటి మట్టం చేరింది. జూరాలకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 1,11,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,19,253 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.08 వద్ద ఉంది. దీంతో ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతోంది. 

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,14,645 క్యూసెక్కులు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 822.50 అడుగు వద్ద నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుంగభద్ర జలాశయానికి కూడా భారీ వరద వస్తోంది. మొత్తం 1633 అడుగులు కాగా, 1624.41 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. అటు.. భద్రాద్రిలోని కిన్నెరసానికి కూడా భారీ వరద రావటంతో నాలుగు గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్