తక్కువ ధరకే బంగారం అంటూ మోసం.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు

బంగారం అంటే మహిళలకు ఎంతో మక్కువ. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి మహిళల ఆసక్తిని ఆసరాగా చేసుకొని ఓ భారీ మోసానికి పాల్పడ్డారు. గోల్డ్ స్కీం పేరుతో దాదాపు నాలుగు కోట్లు వసూలు చేసి ఒక ముఠా ఉడాయించింది.

బంగారం
బంగారం



బంగారం అంటే మహిళలకు ఎంతో మక్కువ. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి మహిళల ఆసక్తిని ఆసరాగా చేసుకొని ఓ భారీ మోసానికి పాల్పడ్డారు. గోల్డ్ స్కీం పేరుతో దాదాపు నాలుగు కోట్లు వసూలు చేసి ఒక ముఠా ఉడాయించింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాదులోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురు మహిళల నుంచి భారీ మొత్తంలో ఒక ముఠా నగదు వసూలు చేసింది. 50 వేలు కట్టి చేరితే 10 శాతం తక్కువకు బంగారం ఇస్తామంటూ ఆశ కల్పించిన ఈ ముఠా.. వందలాది మంది నుంచి డబ్బులు కట్టించుకుంది. బంగారం పట్ల ఆసక్తి ఉన్న ఎంతో మంది భారీ మొత్తంలో ఈ ముఠాకు కట్టేశారు. దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసిన విశాల్, వినయ్, నిఖిల్ అనే ముగ్గురు యువకులు ఆ డబ్బుతో పరారయ్యారు. మోసపోయామని తెలిసిన బాధితులు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ సాగిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్