పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ను మాజీ సర్పంచులు ముట్టడించారు. సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి.. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈవార్తలు, సిరిసిల్ల : పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ను మాజీ సర్పంచులు ముట్టడించారు. సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి.. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు గేటు మూసేసి.. ముట్టడి యత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో గేటు వద్దే నిరసన వ్యక్తం చేసిన మాజీ సర్పంచులు.. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ బయటకు రావాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కొందరు మాజీ సర్పంచులు కలెక్టరేట్ గేట్ ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, మాజీ సర్పంచులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో ఆందోళన చేపట్టిన మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రజావాణికి వచ్చిన ప్రజలను ఒక్కొక్కరిని తనిఖీ చేస్తూ కలెక్టరేట్‌లోకి అనుమతిస్తున్నారు.