తెలంగాణలో 2019కి ముందు బైక్, కారు కొన్నారా.. షాక్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అమర్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. 2019కి ముందు బండి కొంటే కచ్చితంగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీచేసింది.

ts number plates vehicles
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అమర్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. 2019కి ముందు బండి కొంటే కచ్చితంగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీచేసింది. బైకులకు రూ.320 నుండి రూ.500 వరకు.. ఆటోలకు రూ.350 నుండి రూ.450 వరకు.. కార్లకు రూ.590 నుండి రూ.860 వరకు, కమర్షియల్ వాహనాలకు రూ.600 నుండి రూ.800 వరకు నంబర్ ప్లేట్ రేట్లు ఉండనున్నట్లు వివరించింది. ప్రతి వాహనానికి సెప్టెంబరు 30లోగా నంబర్ ప్లేట్స్ బిగించుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. లేదంటే వాహనాన్ని అమ్మడానికి, కొనడానికి.. వాహనంపై ఇన్సూరెన్స్, పొల్యూషన్ వర్తించవని హెచ్చరించింది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు లేకుండా వాహనం రోడ్లపై తిరిగితే పట్టుకోవాలని పోలీసులకు రవాణా శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ నంబర్ ప్లేట్స్ కోసం వాహనం ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన కూడా విధించింది. దీంతో ప్రభుత్వ తీరుపై వాహనదారులు మండిపడుతున్నారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అమర్చుకోవడానికి.. అమ్మకం, కొనుగోలుకు సంబంధం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్