తెలంగాణలో గొర్రెల కొనుగోలు రూ.700 కోట్ల అవినీతిపై ఈడీ దర్యాప్తు

తెలంగాణలో పంపిణీ కోసం గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టిసారించింది. భారీగా డబ్బు మారటం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న ప్రచారంతో పీఎంఎల్‌ఏ చట్టం (మనీలాండరింగ్) కింద దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది.

sheeps distribution

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో పంపిణీ కోసం గొర్రెల కొనుగోళ్లలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టిసారించింది. భారీగా డబ్బు మారటం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న ప్రచారంతో పీఎంఎల్‌ఏ చట్టం (మనీలాండరింగ్) కింద దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌కు ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టర్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం ఈ స్కాంలో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది అరెస్టయ్యారు. ప్రస్తుతం ఈడీ కూడా రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్