జగిత్యాల జిల్లాలో భూ ప్రకంపనలు.. భయభ్రాంతులకు గురైన ప్రజలు

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో భూ ప్రకంపనలు రావడం ఆందోళనకు గురిచేసింది. 30 నుంచి 60 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

earth quake

ప్రతీకాత్మక చిత్రం

జగిత్యాల, ఈవార్తలు : తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో భూ ప్రకంపనలు రావడం ఆందోళనకు గురిచేసింది. 30 నుంచి 60 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ రోజు సాయంత్రం సరిగ్గా 6.50 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటుచేసుకుందని స్థానికులు వెల్లడించారు. ఒక్క సారిగా భూమి తిరిగినట్లు అయ్యిందని, ఏదో శబ్ధం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మల్యాల, మేడిపెల్లి, జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, మెట్‌పల్లి తదితర మండలాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్