BNS Act | హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు.. తొలి ఎమ్మెల్యేగా పోలీస్ రికార్డుల్లో..

హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. నిన్న (మంగళవారం) కరీంనగర్ జడ్పీ సమవేశంలో కౌశిక్ రెడ్డి తీరుపై జడ్పీ సీఈవో ఫిర్యాదు చేయటంతో ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

kaushik reddy
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కరీంనగర్, ఈవార్తలు : హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. నిన్న (మంగళవారం) కరీంనగర్ జడ్పీ సమవేశంలో కౌశిక్ రెడ్డి తీరుపై జడ్పీ సీఈవో ఫిర్యాదు చేయటంతో ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. భారత న్యాయసంహిత చట్టం 221, 126 (2) సెక్షన్ల కింద కేసు పెట్టారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్లే సమయంలో ఆమెను అడ్డుకొనేందుకు కౌశిక్ రెడ్డి బైఠాయించారు. కాగా, బీఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ చట్టం కింద కేసు నమోదైన తొలి ఎమ్మెల్యే ఆయనే కావటం గమనార్హం.

కాగా, నిన్న జడ్పీ సమావేశంలో భాగంగా.. కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు వార్తల్లో నిలిచింది. నియోజకవర్గంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష పెట్టుకొంటే.. హాజరైన వారికి నోటీసులు ఇవ్వడంపై జిల్లా విద్యాధికారి జనార్దన్‌ను నిలదీశారు. ప్రి విలేజ్ మోషన్ పెడతానని అనడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ అంశంతో పాటు దళితబంధుపై కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు కలెక్టర్ ప్రయత్నించగా, ఆమెను అడ్డుకునేందుకు మెట్లపై కౌశిక్ రెడ్డి బైఠాయించారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్