తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలోకి వలసలు.. రేవంత్ సర్కారుపై అప్పుడే విరక్తి పుట్టిందా..?

తెలంగాణలో పరిస్థితి తేడా అవుతోందా? అంటే తాజా పరిస్థితులు అవుననే అంటున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

brs telangana bhavan

బీఆర్ఎస్‌లో చేరుతున్న కాంగ్రెస్ నేతలు

హైద‌రాబాద్, ఈవార్తలు: ఇప్పటికిప్పుడు ఏవైనా ఎన్నికలు ఉన్నాయా? అంటే లేవు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇంకా టైం ఉంది. ఇంకా సంవత్సరం పాటు ఆగాలి. పైగా, అధికారంలో ఉన్న పార్టీకి అనేక అనుకూలతలు ఉంటాయి. అధికార పార్టీలో ఉండి, స్థానిక నాయకులతో కావాల్సిన పనులు చేయించుకోవచ్చు. కానీ, తెలంగాణలో పరిస్థితి తేడా అవుతోందా? అంటే తాజా పరిస్థితులు అవుననే అంటున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు చూపిన చైతన్యం గొప్పది. ఇందుకు నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. 24 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా ఇతర పార్టీలకు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం గొప్ప విషయం. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో కొందరు మోసపోయారు. కానీ, హైదరాబాద్ వాళ్లు మోసపోలేదు. కాంగ్రెస్ ఏంటో తెలుసు కాబట్టి ఇక్కడి ఓటర్లు చైతన్యాన్ని చూపించారు. ఇక.. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే పశ్చాత్తాపం పడే రోజు వస్తుంది. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్యహత్యలే ఉంటాయి. ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు. మీరంతా పార్టీ వెన్నంటే ఉన్నారు. పార్టీలో పటోళ్ల కార్తీక్ రెడ్డి పోరాట పటిమ ప్రదర్శిస్తున్నాడు’ అని తెలిపారు.

అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరఫున కొట్లాడి ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకునే అవకాశం కలుగుతుందని కేటీఆర్ అన్నారు. ఆ అవకాశం కార్తీక్ రెడ్డికి వచ్చిందని చెప్పారు. మూసీ ప్రాజెక్టు వల్ల ప్రజలు బాధపడుతున్నారని కార్తీక్ రెడ్డి చెప్పగానే.. దాదాపు 500-600 కుటుంబాలను కలిసి పరిస్థితిని తెలుసుకున్నామని తెలిపారు. బంగారం లాంటి ఇల్లును, భూమిని విడిచిపెట్టి పోవాలని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని, ఈ దుర్మార్గుడు ఇలా చేస్తాడని ఊహించలేదని సీఎం రేవంత్‌పై మండిపడ్డారు.

అయితే.. అధికార కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వలసలు ప్రారంభం కావడం ప్రస్తుతం షాకింగ్‌గా మారింది. సంవత్సరం కూడా గడవకముందే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందా? అని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పరిస్థితులు బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని, కేసీఆర్ వస్తే ఇక.. కారు జోరు ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్