తీన్మార్ మల్లన్న పద్ధతి మార్చుకో.. కాంగ్రెస్ నేతల మండిపాటు

కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనీల్ మండిపడ్డారు. మల్లన్న తన తీరు మార్చుకోవాలని, కాంగ్రెస్‌లో ఉంటూ.. సొంత పార్టీపైనే విమర్శలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

teenmar mallanna

ఈరవత్రి అనిల్, తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఈవార్తలు : కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనీల్ మండిపడ్డారు. మల్లన్న తన తీరు మార్చుకోవాలని, కాంగ్రెస్‌లో ఉంటూ.. సొంత పార్టీపైనే విమర్శలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నకు కాంగ్రెస్ మద్దతు తెలిపితేనే ఎమ్మెల్సీ అయ్యారని, అలాంటిది సొంత పార్టీపైనే విమర్శలు చేయడం ఏమిటని ధ్వజమెత్తారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని తమకూ ఉంటుందని, కానీ మాట్లాడే పద్ధతి ఇది కాదని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేశారు.

కాగా, గత ఆదివారం మిర్యాలగూడలో నిర్వహించిన బీసీ గర్జన బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. సీఎం రేవంత్, కేబినెట్ మంత్రులను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అన్ని రూ.కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఓసీ సీఎం.. రేవంత్ రెడ్డే చివరివాడు అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో దుమారం చెలరేగింది. తీన్మార్ మల్లన్న లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలోని నేతలే నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి, ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని.. ఇప్పుడు పార్టీపై విషం చిమ్మడం ఏమిటి? అంటూ ఆక్షేపిస్తున్నారు.

మరోవైపు, బీసీ నేత అయినందునే తీన్మార్ మల్లన్నను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పెత్తందారులు చెలరేగిపోతున్నారని పలువురు బీసీ నేతలు అంటున్నారు. బీసీలు ఐక్యతకు తీన్మార్ మల్లన్న కృషి చేస్తున్నారని.. అందుకే ఓసీ నేతలు ఏకమై మల్లన్నను టార్గెట్ చేశారని మండిపడుతున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మల్లన్న ప్రశ్నిస్తున్నారని గుర్తుచేశారు. ఇకనైనా మల్లన్నపై విమర్శలు మానుకోకపోతే మరో ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్