17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

tELANGANA THALLI

తెలంగాణ తల్లి విగ్రహాం

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆకుపచ్చని చీరలో.. బంగారు గొలుసు ధరించగా.. ఓ చేతిలో మొక్కజొన్న, మరో చేతితో అభయ హస్తాన్ని ఇస్తున్నట్లు విగ్రహం ఉంది. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు.. విగ్రహానికి ఉన్న ముసుగు తొలగించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్