Telangana Emblem | తెలంగాణ కొత్త రాజముద్రగా అదే ఫైనల్..?

Telangana New Logo | తెలంగాణ రాష్ట్ర కొత్త రాజముద్ర ఫైనల్ అయ్యిందా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. రాజముద్రలకు సంబంధించి పలు ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిలో ఒకదాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఫైనల్ చేసినట్లు సమాచారం.

telangana logo

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలంగాణ లోగోలు

తెలంగాణ రాష్ట్ర కొత్త రాజముద్ర ఫైనల్ అయ్యిందా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. రాజముద్రలకు సంబంధించి పలు ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిలో ఒకదాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఫైనల్ చేసినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త లోగోను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రత్యేక సమీఓ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, లోగో రూపకర్త రుద్ర రాజేశం, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ప్రస్తుతం మూడు లోగోలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని పరిశీలిస్తే.. (1) ఒక లోగోలో పైభాగంలో మూడు సింహాలు, కింద చార్మినార్, నాలుగు భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అక్షరాలు ఉన్నాయి. మధ్యలో పూర్ణకుంభం, దాని చుట్టూ బంగారు ఆకులు డిజైన్ చేసి ఉన్నాయి. (2) ఇంకో లోగోలో.. పైభాగంలో మూడు సింహాలు, కింద ట్యాంక్‌బండ్ గౌతమ బుద్ధుడు, నాలుగు భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అక్షరాలు, మధ్యలో తెలంగాణ రాష్ట్ర పటం, పూర్ణకుంభం, బంగారు ఆకులు ఉన్నాయి. (3) మరో లోగోలో.. పైభాగంలో మూడు సింహాలు, నాలుగు భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అక్షరాలు, మధ్యలో పైభాగంలో నీలం రంగులో ఆరు ఆకులు, దిగువన పారిశ్రామిక అభివృద్ధిని సూచించే ఫ్రేమ్‌ను డిజైన్ చేశారు. ఈ మూడింటిలో ఒక డిజైన్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

మరోవైపు, రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ స్వరకల్పన పూర్తయినట్లు తెలిసింది. జూన్ 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పాటను విడుదల చేయనున్నారు. అందెశ్రీ రాసిన ఈ పాటకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దీనిపై వివాదం కొనసాగుతోంది. తెలంగాణ పాటకు ఏపీకి చెందిన వ్యక్తి సంగీతం అందించటం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. అయితే, సంగీత దర్శకుడి ఎంపికలో తన ప్రమేయం లేదని, అంతా అందెశ్రీదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్