తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ రేవంత్ రెడ్డికి షాక్.. సొంత జిల్లాలో కాంగ్రెస్ ఘోర పరాజయం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న వేళ అధికార పార్టీ కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి ఘోర పరాజయం ఎదురైంది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో నవీన్ కుమార్ గెలుపొందారు.

Naveen Kumar Reddy

నవీన్ కుమార్  రెడ్డి


మహబూబ్ నగర్, ఈవార్తలు :  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న వేళ అధికార పార్టీ కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి ఘోర పరాజయం ఎదురైంది.  మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో నవీన్ కుమార్  రెడ్డి  గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 1,437 కాగా, బీఆర్ఎస్‌కు 763, కాంగ్రెస్‌కు 652, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు వచ్చింది. 21 ఓట్లు చెల్లలేదు. మొదటి ప్రాధాన్య ఓట్లలోనే బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్, నాయకులు కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఓట్లు లెక్కింపు జరుగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. బిఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని తేలడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ సీఎం రేవంత్ రెడ్డికి ఇది గట్టి షాక్ గానే చెప్పాలి. సీఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఎదుర్కొన్న తొలి ఎన్నిక ఫలితం ఇదే కావడం గమనార్హం. ఈ ఫలితం ఒక రకంగా భారతీయ రాష్ట్ర సమితికి ఉత్సాహాన్ని ఇచ్చేదిగా చెప్పవచ్చు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత భారతీయ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహంలో కూరుకుపోయారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాది కూడా పూర్తికాకుండానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీకి మనో స్థైర్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందని రాజకీయ పార్టీల విశ్లేషకులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్