Mallial : బడిబాట కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం

జగిత్యాల జిల్లా మల్యాల మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ( ZPHS Mallial )లో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

mallial badi bata

మల్యాల బడి బాట కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా,  చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం తదితరులు

మల్యాల, ఈవార్తలు: రాష్ట్రవ్యాప్తంగా బడిబాట ( Badi Bata ) కార్యక్రమంగా ఘనంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ( ZPHS Mallial )లో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా తదితరులు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందజేశారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. బడి బాట కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు. విద్యార్థులంతా చదువుకొని గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వీఓఏలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్