ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లిన కేటీఆర్.. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
కేటీఆర్‌తో చిలుకూరు టెంపుల్ ప్రధానార్చకుడు రంగరాజన్
చిలుకూరు, ఈవార్తలు : ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లిన కేటీఆర్.. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. తమ నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ అర్చకుడిపై దాడి జరిగినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. రంగరాజన్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబిత ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.