తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ఆయన ఆకర్ష్ మంత్ర కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరింత దూకుడును పెంచారు. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను ఆయన పార్టీలో చేర్చుకున్నారు.
రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన యాదయ్య
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ఆయన ఆకర్ష్ మంత్ర కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరింత దూకుడును పెంచారు. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను ఆయన పార్టీలో చేర్చుకున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కొద్దిరోజులు కిందట పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆ తరువాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎంపీపీ, జెడ్పీటీసీగా పని చేసిన ఆయన 2009లో తొలిసారి చేవెళ్ల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2014 ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు.
బీఆర్‌ఎస్‌కు చెందిన మరింత మంది నేతలు టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. వీరిలో కొందరిని కొద్దిరోజుల్లోనే చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మరింత తన ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునేలా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో కాలె యాదయ్య ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో పార్టీలో చేరారు.