భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ ఐఏఎస్ ఆలోచన ప్రతి విషయంలో డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి పనిలో నూతన తరహా కోరుకుంటారు. ఏదైనా చక్కని ఆలోచన వచ్చిందంటే దాన్ని అమలు చేసే వరకు నిద్రపోరు. ఐటీడీఏ పరిధిలోని వివిధ డిపార్ట్మెంట్లో ఇప్పటికే నూతన సంస్కరణలు తీసుకొచ్చి సఫలీకృతులైన ఐఏఎస్ రాహుల్ మరో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు.
భద్రాచలం ట్రైబల్ మ్యూజియం (ఇన్‌సెట్‌లో ఐటీడీఏ పీవో రాహుల్)
భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ ఐఏఎస్ ఆలోచన ప్రతి విషయంలో డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి పనిలో నూతన తరహా కోరుకుంటారు. ఏదైనా చక్కని ఆలోచన వచ్చిందంటే దాన్ని అమలు చేసే వరకు నిద్రపోరు. ఐటీడీఏ పరిధిలోని వివిధ డిపార్ట్మెంట్లో ఇప్పటికే నూతన సంస్కరణలు తీసుకొచ్చి సఫలీకృతులైన ఐఏఎస్ రాహుల్ మరో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. అదే భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ట్రైబల్ మ్యూజియం. గతంలో కొన్ని కొన్ని సౌకర్యాలతో పరిమితమైన ఈ మ్యూజియం ప్రస్తుతం అన్ని హంగులతో చూపరులను ఆకట్టుకునేలా సిద్ధమైంది. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం కళ్ళకు కట్టినట్లు ఉట్టిపడేలా ఈ ట్రైబల్ మ్యూజియం కేరాఫ్ అయ్యింది.
భద్రాచలం ఐటిడిఏ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం సజీవ సంస్కృతికి నిలయంగా మారింది. గిరిజనుల ఆనాటి ఆచార సంప్రదాయాలు, జీవన విధానం, పండుగలు, ఉపయోగించిన పనిముట్లు అన్ని సేకరించి ట్రైబల్ మ్యూజియంలో భద్రపరిచారు. తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులు చూపిస్తున్నాయి. ఇవి చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గిరిజనుల ఇల్లు, వాకిళ్లు, ఎడ్లబండ్లు, వేటకు ఉపయోగించిన వస్తువులు... ఇలా రకరకాలు ఆనాడు గిరిజనులు ఉపయోగించిన వస్తుశాలను ప్రదర్శనగా ఉంచటంతో ఇవి వీక్షకులను ఆలోచింప చేస్తున్నవి. గిరిజనుల వేషధారణ, అలవాట్లు, కట్టుబాట్లు తరతరాల చిత్రకళ కూడా శోభయామానంగా ఉన్నాయి.
ఈ ట్రైబల్ మ్యూజియమును ఐటిడిఏ పిఓ రాహుల్ ఆధునికరించి ప్రస్తుతం అన్ని హంగులతో తీర్చిదిద్దారు. లైఫ్ స్టైల్ రూమ్, ఆర్నమెంట్ రూమ్, ఫెస్టివల్ రూమ్, హంటింగ్ రూమ్, ఇలా ప్రత్యేక రూముల్లో గిరిజనులు వాడిన పరికరాలను ఏర్పాటు చేశారు. ట్రైబల్ మ్యూజియం కు వచ్చే యాత్రికుల కోసం మరిన్ని అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. గిరిజనులు ఉపయోగిస్తున్నటువంటి మట్టి ఇల్లు, ట్రెడిషనల్ హౌస్ లు ఏర్పాటు చేసి వాటిని అందంగా తీర్చిదిద్దారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైన బోటింగు ఏర్పాటు చేశారు. బీచ్ వాలీబాల్, బాక్స్ క్రికెట్, బ్యాడ్మింటన్, ఆచరి ఇలా రకరకాల ఆటలు ఆడుకునేందుకు మైదానాన్ని ఏర్పాటు చేశారు.
గిరిజనుల రుచికరమైన, బలవర్ధకమైన ఆహారాన్ని ఈ ట్రైబల్ మ్యూజియంలో యాత్రికుల కోసం సిద్ధంగా ఉంచుతున్నారు. ఈ తరహా ఫాస్ట్ ఫుడ్ యాత్రకులకు ఎంతగానో సౌకర్యంగా ఉండనుంది. ప్రత్యేక విద్యుత్తు అలంకరణతో, అడుగడుగు ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ ఆధునిక హంగులతో ట్రైబల్ మ్యూజియాన్ని సిద్ధపరిచారు. భద్రాచలం ప్రాంతానికి వచ్చే యాత్రికులతో పాటు, భక్తులు కూడా ఈ ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించేలా ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి రోజున ఈ ట్రైబల్ మ్యూజియం ప్రారంభించనున్నారు.