జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ గ్రామంలోని ప్రతి ఇంటా సంబురాలు తెచ్చింది. ప్రతి ఆడబిడ్డ మోములో ఆనందం నింపింది.
బతుకమ్మ ఆడుతున్న బల్వంతాపూర్ మహిళలు
ఆడబిడ్డల ఆనందానికి ఇది ఆరంభం..
బతుకమ్మ పండుగకు ఇది ప్రారంభం..
చప్పట్లు, గజ్జెల మోతల సంబురం..
ప్రతి మోములో సంతోషాల సంరంభం..
బతుకమ్మ తల్లికి ఘన స్వాగతం..
పూల పండుగకు ‘తొలి’ సుస్వాగతం..
జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ గ్రామంలోని ప్రతి ఇంటా సంబురాలు తెచ్చింది. ప్రతి ఆడబిడ్డ మోములో ఆనందం నింపింది. గతంలో ఎన్నడూ ఇలా తొలి రోజున (ఎంగిలిపూల బతుకమ్మ రోజు) గ్రామంలోని ఆడబిడ్డలంతా అంతా కలిసి ఆడిన సందర్భాలు లేవని.. తొలిసారి గ్రామమంతా ఏకమై వచ్చి.. బతుకమ్మ పండుగకు ఘనస్వాగతం పలికిందని అక్కడి ప్రజలు చెప్పారు. తాను పెళ్లై ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఎంగిలిపూల బతుకమ్మ రోజు ఊరంతా కలిసి ఆడిన సందర్భం లేనేలేదని ఓ వృద్ధురాలు చెప్పుకొచ్చింది. బతుకమ్మ పండుగ రోజు ఉండే సందడి తొలి రోజునే కనిపించిందని ఆనందం వ్యక్తం చేసింది. కొందరు మహిళలు ఏక రూప చీరలు ధరించి బతుకమ్మ ఆడి కన్నుల విందు చేశారు. చాలా మంది యువతులు బతుకమ్మ రోజున తయారైనట్టే.. ఎంగిలిపూల బతుకమ్మ కోసం తయారై వచ్చి.. చప్పట్లు, కోలాటం ఆడి సంబురాలు చేసుకున్నారు.