బీఆర్ఎస్‌లో మరో వికెట్ డౌన్.. హైదరాబాద్ జోన్‌లో కాంగ్రెస్‌కు వలసల జోరు

శనివారం ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.

arekapudi gandhi

కాంగ్రెస్‌లో చేరిన అరికపూడి గాంధీ

హైదరాబాద్, ఈవార్తలు : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు ఆగడం లేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు. రెండ్రోజుల క్రితమే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హస్తం పార్టీలో చేరగా, తాజాగా శనివారం ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను అధికాార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రజాభిప్రాయం, కార్యకర్తల నిర్ణయంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

ఇప్పటిదాకా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

1. తెల్లం వెంకట్రావు

2. కాలే యాదయ్య

3. దానం నాగేందర్

4. పోచారం శ్రీనివాస్ రెడ్డి

5. డాక్టర్ సంజయ్ కుమార్

6. కడియం శ్రీహరి

7. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

8. ప్రకాశ్ గౌడ్

9. అరెకపూడి గాంధీ


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్