అక్కినేని కుటుంబం నుంచి సినీ హీరో అఖిల్ ఈ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. తన మాజీ వదిన సమంతకు మద్దతుగా నిలిచారు. కొండా సురేఖను వదిలేదే లేదని అఖిల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు, హైదరాబాద్: యాక్టర్స్ నాగచైతన్య, సమంత విడాకులపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ దుమారం రేపిన విషయం తెలిసిందే. వారిద్దరి డైవర్స్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని ఆమె ఆరోపించారు. అలాగే, సినీ ఇండస్ట్రీస్ లోని హీరోయిన్లపై ఆమె కామెంట్స్ చేశారు. హీరోయిన్స్ కు కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశాడని, చాలామంది హీరోయిన్లు ఆయన బాధ తట్టుకోలేక పెండ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారని సురేఖ ఆరోపించారు. అనంతరం సినీ ఇండస్ట్రీ నుంచి విమర్శలు వెల్లువెత్తడం, చిరంజీవిలాంటి మెగా హీరో కూడా స్పందించడంతో సమంతపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని సురేఖ మీడియాతో అన్నారు. అదే సమయంలో నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారో అందరికీ తెలియాలి అంటూ మరో కామెంట్ చేశారు. దీంతో అక్కినేని కుటుంబం నుంచి సినీ హీరో అఖిల్ ఈ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. తన మాజీ వదిన సమంతకు మద్దతుగా నిలిచారు. కొండా సురేఖను వదిలేదే లేదని అఖిల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హెచ్చరించారు.
అఖిల్ ఏమన్నారంటే..
‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, అసభ్యకరం, జుగుప్సాకరం. ఆమె సామాజిక విలువలు, సంక్షేమాన్ని మరిచిపోయారు. ప్రజా ప్రతినిధిగా ఆమె ప్రవర్తన సిగ్గుచేటు. క్షమించరానిది కూడా. ఆమె కామెంట్స్ మా కుటుంబ సభ్యుల గౌరవాన్ని కించపరిచాయి.మమ్మల్ని అగౌరపరిచాయి.’ అని అఖిల్ ఫైర్ అయ్యారు. కొండా సురేఖ ను తమ కుటుంబం వదిలిపెట్టబోదని హెచ్చరించారు.