నర్సింగ్ వృత్తిపై ఆసక్తిని పెంచుకుంటున్న యువతుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదుకు చెందిన ఒక సంస్థ తెలంగాణలోని యువతలకు ఉచితంగా నర్సింగ్ శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో హైదరాబాదులోని ప్రథమ్ హెల్త్ కేర్ శిక్షణా కేంద్రంలో రెండు నెలల పాటు ఉచితంగా నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ జిల్లా కో - ఆర్డినేటర్ సరితా సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణకు 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగిన యువతులు అర్హులుగా పేర్కొన్నారు.
నర్సింగ్ విద్యార్థినులు
గతంతో పోలిస్తే మహిళలు ఉద్యోగాలు చేసేందుకు పోటీపడుతున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆరోగ్య రంగంలో పనిచేసే మహిళల సంఖ్య అయితే పురుషుల కంటే ఎక్కువగా ఉంది. నర్సింగ్ వృత్తిని చేపడుతున్న యువతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే భారీ వేతనాలతో ఈ రంగంలో వారికి ఉద్యోగాలను కల్పిస్తున్నారు. దీంతో నర్సింగ్ వృత్తిపై ఆసక్తిని పెంచుకుంటున్న యువతుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదుకు చెందిన ఒక సంస్థ తెలంగాణలోని యువతలకు ఉచితంగా నర్సింగ్ శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో హైదరాబాదులోని ప్రథమ్ హెల్త్ కేర్ శిక్షణా కేంద్రంలో రెండు నెలల పాటు ఉచితంగా నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ జిల్లా కో - ఆర్డినేటర్ సరితా సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణకు 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగిన యువతులు అర్హులుగా పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఏఎన్ఎం, జిఎన్ఎం, డిప్లమో లేదా ఇతర ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డు, మూడు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో అక్టోబర్ ఏడో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షణాకాలంలో ఉచిత వసతి సౌకర్యం, ఒక జత యూనిఫాం, స్టడీ మెటీరియల్ అందించనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సదరు సంస్థ ప్రతినిధులు కోరారు. మరిన్ని వివరాలకు 9000203952 నెంబర్ కు సంప్రదించాలని కోరారు. పదవ తరగతి పూర్తి చేసి, ఇతర కారణాలవల్ల ఇంటి పనులకు పరిమితమైన వాళ్ళు జాబ్ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. శిక్షణ పొందాలి అంటే పైన పేర్కొన్న ద్రుపత్రాలు కచ్చితంగా ఉండాలి.
మెరుగైన ఉద్యోగ అవకాశాలు
నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతలకు కనీసం రూ.10 నుంచి రూ.15 వేలు వేతనంతో ఉద్యోగాలను వెంటనే కల్పించే వెసులు బాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఉంది. ఆరోగ్య రంగంలో కొత్తగా ఏర్పాటు అవుతున్న ఆసుపత్రులు సంఖ్య పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగానే నర్సింగ్ సిబ్బంది అవసరాలు ఏర్పడుతున్నాయి. కొత్తగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తే కనీసం వంద నుంచి 200 మంది నర్సింగ్ సిబ్బంది అవసరమవుతున్నారు. అందుకు అనుగుణంగా నర్సింగ్ సిబ్బందిని ఉత్పత్తి చేసే సంస్థలు పెరిగాయి. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ లతోపాటు ప్రైవేటు రంగంలోనూ నర్సింగ్ కోర్సులను అందిస్తున్న సంస్థలు పెరగడంతో ఈ రంగంలో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా నర్సింగ్ సిబ్బందిని అందించగలుగుతున్నారు.