ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే 3 రోజులు రాష్ట్రమంతా..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

వెదర్ న్యూస్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణను భారీ వానలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజుల వరకు కనిపించకుండా పోయిన వానలు.. ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చి, కుండపోతను కురిపించాయి. అటు.. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కేంద్రీకృతం కావటంతో రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంటూ మూడు రోజుల పాటు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించిన ఐఎండీ.. ఆదివారం నుంచి సోమవారం వరకు మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్