|| ప్రతీకాత్మక చిత్రం || తెలంగాణలో పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పదోన్నతులు, బదిలీల కోసం ఎదురు చూస్తున్న టీచర్లకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పదోన్నతులు, బదిలీలు కోసం ఉపాధ్యాయ సంఘాలు ఈ నెల 15 న జేఏసీల సమక్షంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. దీనిపై విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి శుక్రవారం అధికారులతో చర్చించి ప్రభుత్వ ఆమోదంతో ఈ ప్రక్రియను ఈనెల 27 నుంచి ప్రారంభం చెయ్యనున్నారు. టీచర్ జనవరి 28 నుంచి జనవరి 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పూర్తి పారదర్శకంగా చేపట్టాలని నిర్ణయాన్ని టీచర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 4 నాటికి ఈ ప్రక్రియ ముగియయున్నది. మార్చి 5 నుంచి 19 వరకు విజ్ఞప్తి స్వీకరించే అవకాశం ఉంది. టీచర్లు దరఖాస్తులు చేసిన 15 రోజుల్లో కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా వీటిని చేపట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం ముగిసే అనంతరం వరకు విద్యార్థులు పాత స్థానాల్లోనే ఉంటారు. ఈ విద్యాసంవత్సరం ముగిసిన తర్వాత ఏప్రిల్ 23న కేటాయించిన కొత్త స్థానాలను తెలుసుకుని.. కొత్త స్థానాల్లో పదోన్నతులు, బదిలీలు చేపడతారు.