SSC Exams Telangana | తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతిలో నిర్వహించే బోర్డు పరీక్షలను 100 మార్కులతో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

telangana ssc exams

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతిలో నిర్వహించే బోర్డు పరీక్షలను 100 మార్కులతో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గతంలో 80 మార్కులతో బోర్డ్ పేపర్, 20 మార్కులు ఇంటర్నల్‌గా ఉండేవి. ఆ ఇంటర్నల్ మార్కులను తొలగించి.. మొత్తం 100 మార్కులకు బోర్డు ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇంటర్నల్ మార్కులు అవసరం లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

వాస్తవానికి గతంలో పదో తరగతి బోర్డు పరీక్షల్లో 100 మార్కులతోనే నిర్వహించేవారు. హిందీ ఒకే పేపర్ 100 మార్కులు కాగా, మిగతా సబ్జెక్టుల్లో 50+50 మార్కులు (రెండు పేపర్లు).. మొత్తంగా 11 పరీక్షలు నిర్వహించేవారు. తర్వాత మారిన పరిస్థితులు, విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో ఇంటర్నల్ మార్కులకు అవకాశం కల్పించారు. ఇంటర్నల్ మార్కుల విధానం డిగ్రీ, బీటెక్, డిప్లొమా తదితర కోర్సుల్లో ఉండేది. అదే విధానాన్ని పదో తరగతిలోనూ అమలు చేశారు. అయితే.. గ్రేడింగ్ విధానంలో మార్కులు వెల్లడిస్తున్నందున ఆ అవసరం లేదని భావించినట్లు విద్యాశాఖ తాజాగా స్పష్టం చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్