తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలతో ఇరు పార్టీల నేతలు రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అదే అగ్రనేతల ఢిల్లీ ప్రయాణం. భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. తాజాగా మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలతో ఇరు పార్టీల నేతలు రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అదే అగ్రనేతల ఢిల్లీ ప్రయాణం. భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. తాజాగా మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీలో ఏం జరగబోతుందన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇప్పటికే కేటీఆర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలపై పెద్దలతో చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు తాజా రాజకీయ పరిస్థితులను హైకమాండ్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, కుల గణన ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకు వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం టూర్ లో రాజకీయంగా ఎటువంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న చర్చ జరుగుతోంది. పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులకు తనపై చేసిన ఫిర్యాదులకు సంబంధించిన అంశాలపై మాట్లాడే అవకాశం కనిపిస్తుంది.
కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేసిన కేటీఆర్
ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్న కేటీఆర్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కట్టర్ కు ఫిర్యాదు చేశారు. అమృత్ పథకంలో అక్రమాలు జరిగాయి అంటూ ఫిర్యాదు ఇచ్చారు కేటీఆర్. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకుండా టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. అమృత 2.0 ప్రాజెక్టులో తెలంగాణకు కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కట్టర్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరి కేటీఆర్ ఫిర్యాదుపై కేంద్రమంత్రి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మంగళవారం కూడా మరి కొంతమంది మంత్రులను కలిసి కొన్ని అంశాలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు ఢిల్లీలో ఉండడంతో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.