|| ప్రతీకాత్మక చిత్రం ||
తెలంగాణ మోడల్ స్కూల్లో 2023- 2024 విద్యా సంవత్సరం కోసం 6వ తరగతి,7 వ తరగతి నుండి పదవ తరగతి వరకు (మిగిలిన సీట్లు)సీట్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు దరఖాస్తు చేసుకొనేందుకు 15 ఫిబ్రవరి చివరి తేదీ. దరఖాస్తు చేసుకోవడానికి ఆన్ లైన్ లింక్ https://telanganams.cgg.gov.in/ అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 8 ఏప్రిల్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు 16 ఏప్రిల్ తేదీన 6 తరగతికి ఉదయం 10 గంటల 12 గంటల వరకు, 7వ తరగతి నుండి 10 వ తరగతి వారికి మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుంది.
తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు ప్రత్యేకతలు :
ఉత్తమ బోధన కలిగిన ఉపాధ్యాయుల చేత బోధన. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మంచి బోధనతో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేసి, విద్యార్థులకు ఉచిత పుస్తకాలతో పాటు ఉచిత యూనిఫామ్ కూడా ఇవ్వబడును. ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులను గైడ్ చేస్తూ శాశ్వతమైన ఆటస్థలం, K-Yan ప్రొజెక్టర్ రూమ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ రూమ్ లతో విద్యార్థులను నేటి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేందుకు అద్భుత మేధస్సు గల ఉపాధ్యాయ బృందం. అలాగే NEET, IIT, EMCET పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం.