పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మంత్రి జగదీశ్ రెడ్డి హాజరు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మంత్రి జగదీశ్ రెడ్డి హాజరు||

(ఈవార్తలు, ఎల్బీనగర్ ప్రతినిధి, దేవులపల్లి రంగారావు)

సూర్యాపేట జిల్లా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన పూర్వ విద్యార్థి బృందానికి తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, నాటి సూర్యాపేట శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థి గుంటకళ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో 1970 నుండి 2023 వరకు చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1970 నుండి 2023 వరకు చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి తీవ్ర పని ఒత్తిళ్లు ఉన్నా తన తోటి విద్యార్థులపై ఉన్న ప్రేమతో ఈ కార్యక్రమానికి హాజరయ్యాయని తెలిపారు. ఆయా సంవత్సరాల్లో వివిధ తరగతులలో విద్యను అభ్యసించిన తన మిత్రులు దేశ విదేశాలలో అనేక హోదాలలో రాష్ట్రానికి, దేశానికి విదేశాలకు సేవలు చేస్తున్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు ఉప్పు సత్యనారాయణ, గోపగాని వెంకటనారాయణ, రెండుసార్లు సూర్యాపేట కౌన్సిలర్ గా పని చేసిన అక్కిరాజు దుర్గాప్రసాద్, ధనుంజయ గౌడ్, శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి ముదిశెట్టి నరసింహారావు, సాయిబాబా నంద్యాల దయాకర్ రెడ్డి, పూర్వ విద్యార్థులు కనుమంత రెడ్డి, సీతారాం రెడ్డి, హనుమంత రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సూర్యాపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రస్తుతం పనిచేస్తున్న కౌన్సిలర్లు హాజరయ్యారు. చాలా మంది ప్రముఖులు కార్యక్రమంలో ప్రసంగించి వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్