సిజేరియన్లు అధికంగా జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ టాప్.. 6.7 శాతం సిజేరియన్లు

దేశ వ్యాప్తంగా సాధారణ ప్రసవాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆసుపత్రికి వెళితే సుఖవంతమైన ప్రసవం జరుగుతుందని చెబుతారు. అయితే, సుఖవంతమైన ప్రసవాల కోసం సిజేరియన్లను దేశ వ్యాప్తంగా ఇష్టానుసారంగా చేసేస్తున్నారు. సిజేరియన్లు అధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ లో ఉంది. తెలంగాణలో జరిగే ప్రసవాల్లో 60.7 శాతం సిజేరియన్లు కావడం గమనార్హం. అంటే ప్రతి 100 ప్రసవాల్లో 61 మందికి సిజేరియన్లు చేసేస్తున్నారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశ వ్యాప్తంగా సాధారణ ప్రసవాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆసుపత్రికి వెళితే సుఖవంతమైన ప్రసవం జరుగుతుందని చెబుతారు. అయితే, సుఖవంతమైన ప్రసవాల కోసం సిజేరియన్లను దేశ వ్యాప్తంగా ఇష్టానుసారంగా చేసేస్తున్నారు. సిజేరియన్లు అధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ లో ఉంది. తెలంగాణలో జరిగే ప్రసవాల్లో 60.7 శాతం సిజేరియన్లు కావడం గమనార్హం. అంటే ప్రతి 100 ప్రసవాల్లో 61 మందికి సిజేరియన్లు చేసేస్తున్నారు. ఇది అత్యంత ఆందోళనకరమైన అంశంగానే భావించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తాజా గణాంకాలను నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఆధారంగా ఢిల్లీలోని జార్జ్ ఇన్స్టిట్యూట్ జరిపిన అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా చూస్తే ఇది 21.5 శాతంగా ఉన్నట్లు తెలిపింది. దేశ సగటుతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా తెలంగాణలో సిజేరియన్లు జరుగుతుండడం ఆందోళన కారణమైన అంశంగా పేర్కొంది. దేశంలోనే 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో 15 నుంచి 49 ఏళ్ల వయసు ఉన్న 7.2 లక్షల మంది మహిళల ప్రసవ వివరాలు ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ వివరాలు ద లాన్సెంట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా జర్నల్ లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డకు జన్మనిస్తున్నారు. ఈ శస్త్ర చికిత్సలు ఎక్కువ శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారే ఈ ఆపరేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సిజేరియన్లలో రాష్ట్రాలు వారీగా బాగా తేడాలు ఉన్నాయి. నాగాలాండ్ లో 5.2 శాతం మేర సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతుండగా, తెలంగాణలో ఏకంగా 60. 7 శాతం మేర సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు ఈ అధ్యయంలో వెల్లడైంది. వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండడం, ఆర్థిక స్తోమత పెరగడం, సహజ ప్రసవాలు అంటే భయం, బిడ్డ జననానికి ముహూర్తాలు చూసుకోవడం వంటి అంశాలు సిజేరియన్ల వైపు మొగ్గు చూపడానికి కారణాలవుతున్నాయి. బీహార్ వంటి పేద రాష్ట్రాల్లో డాక్టర్లు సి సెక్షన్ ఆపరేషన్లు చేయాలని చెప్పినా అక్కడ వారు మాత్రం సహజ ప్రశవాలనే కోరుకుంటున్నారు. 2019 - 21 మధ్య ఏడాదిలో ఆసుపత్రిలోని సమాచారం ఆధారంగా జాతీయ ఆరోగ్య సర్వేను నిర్వహించారు. 

సాధారణ ప్రసవాలతో పోలిస్తే సిజేరియన్ ప్రసవాలకు ఖర్చు కూడా అధికంగా అవుతుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ చేయాలంటే ఆసుపత్రి స్థాయిని బట్టి తక్కువలో తక్కువగా రూ.30,000 నుంచి లక్ష రూపాయలు వరకు ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ ఖర్చు మరింత అధికంగా కూడా ఉంటుంది. కొన్నిసార్లు గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు సిజేరియన్ వద్దంటున్నప్పటికీ ఆసుపత్రుల యాజమాన్యాలు కొన్ని రకాల భయాలను సృష్టించి సిజేరియన్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరికొన్ని సిజేరియన్లు మాత్రం స్వయంగా గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు కోరిక మేరకే చేస్తున్నారు. ఏది ఏమైనా దేశ వ్యాప్తంగా సిజేరియన్ ప్రసవాలు పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశంగానే నిపుణులు చెబుతున్నారు. సిజేరియన్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మహిళలు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెన్నునొప్పి వంటి ఇబ్బందులు వీరిని వేధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్