Telangana News | తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు హైకోర్టు ఝలక్.. ఆంధ్రాకు వెళ్లిపోవాలని..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాలని హైకోర్టు తీర్పు వెలువరించింది ||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు రాష్ట్ర హైకోర్టు ఝలక్ ఇచ్చింది. సీఎస్‌గా ఆయన కేటాయింపును రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ మంగళవారం ఈ తీర్పు ఇచ్చింది. సోమేశ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశించింది. అటు క్యాట్ మధ్యంతర ఉత్తర్వులను కూడా ధర్మాసనం కొట్టివేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌ను ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కేటాయించింది. అయితే, ఆయన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. క్యాట్.. కేంద్ర ఉత్తర్వులను నిలిపివేసి, తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన ప్రస్తుతం తెలంగాణలోనే సీఎస్‌గా కొనసాగుతున్నారు. అయితే, కేంద్రం హైకోర్టును ఆశ్రయించడంతో క్యాట్ మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం కొట్టివేసింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ హుటాహుటిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ప్రగతిభవన్ కు వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్టు తెలిసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్