తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌ల బదిలీ.. రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| ఐఏఎస్‌ల బదిలీ ||

ఈవార్తలు, తెలంగాణ : తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి  మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్‌గా భారతి హోళికేరి, మేడ్చల్-మల్కాజ్గిరి కలెక్టర్ గా అమోయ్ కుమార్, నిజామాబాద్ కలెక్టర్‌గా రాజీవ్ గాంధీ హనుమంతు, హనుమకొండ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్, కొమురం భీం కలెక్టర్‌గా షేక్ యాస్మిన్ బాషా, వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి, మహబూబ్ నగర్ కలెక్టర్‌గా జి.రవి, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా ఎస్.వెంకటరావు, రంగారెడ్డి కలెక్టర్‌గా ఎస్.హరీశ్, మంచిర్యాల కలెక్టర్‌గా బాదావత్ సంతోష్, మెదక్ జిల్లా కలెక్టర్‌గా రాజార్షి షా, వనపర్తి జిల్లా కలెక్టర్‌గా తేజస్ పవార్, నిర్మల్ కలెక్టర్‌గా వరుణ్ రెడ్డి, జగిత్యాల కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్