తెలంగాణలో పంచాయతీలకు మహర్దశ.. కొత్తగా 3,687 భవనాలు మంజూరు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(ఫొటో: తెలంగాణలో 3,687 కొత్త పంచాయతీ భవనాలు)

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణ వ్యాప్తంగా కొత్త పంచాయతీ భవనాలు కట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అవసరం ఉన్న గ్రామాల్లో 3,687 పంచాయతీ భవనాలను మంజూరు చేసింది. ఈ మేరకు ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన సౌలభ్యం కోసం ఈ పంచాయతీ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ భవనాలను మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్ (ఉపాధి పథకం) కింద కట్టనున్నారు. దీనికి సంబంధించిన జీవో కూడా విడుదలైంది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ హనుమంత రావు జీవో విడుదల చేశారు. ఉపాధి పథకం మార్గదర్శకాల మేరకు పంచాయతీ భవనాలు నిర్మించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.




సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్