కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు విడుదల.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ||

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్ర అభివృద్ధికి వంద కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మాట ఇచ్చినా రెండు నెలల్లోపే నిధులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ అభివృద్ధి పనులను జాబితా తయారు చేసి పంపాలని జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్