||ప్రతీకాత్మక చిత్రం||
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తన హామీల అమలును ప్రారంభించింది. ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. ఈ మేరకు శుక్రవారం విధివిధానాలపై జీవో విడుదల చేసింది. తెలంగాణకు చెందిన మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. శనివారం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించి చార్జీ మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకం కింద జీరో టికెట్‌ను అవలంబిస్తుంది.