||ప్రతీకాత్మక చిత్రం||
ఇంటర్ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ నెల 28న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. మార్చి 3 వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 7,8,9 తేదీల్లో జరగగా, ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 28,
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 3
దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 10.
దరఖాస్తులో లోపాలు ఎడిట్ చేసుకునే అవకాశం : ఏప్రిల్ 12 నుండి 14 వరకు
ఎంసెట్ హల్ టికెట్స్ : ఏప్రిల్ 30 నుంచి
ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు : మే 7,8, 9 తేదీల్లో
ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు : మే10,11 తేదీల్లో
పరీక్ష సమయం : ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు
పరీక్ష ఫీజు : ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 500, ఇతర విద్యార్థులకు రూ. 900
దరఖాస్తు : ఆన్ లైన్