వైన్స్ 24 గంటల పాటు ఓపెన్‌పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్ : దుకాణాలు, ఎస్టాబ్లిష్‌మెంట్లు 24 గంటల పాటు తెరిచి ఉంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. అయితే, ఈ నిబంధన వైన్ షాపులకు కూడా వర్తిస్తుందా? అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ స్పష్టత ఇచ్చింది. దుకాణాలు, ఎస్టాబ్లిష్‌మెంట్లు 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు జారీ చేసిన ఉత్తర్వులు (జీవోఎంఎస్‌-4).. ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖకు వర్తించవని స్పష్టం చేసింది. ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల ప్రకారం నిర్దేశించిన సమయాల్లోనే వైన్ షాపులు తెరిచి ఉంటాయని తేల్చి చెప్పింది. టీఎస్‌బీసీఎల్, ఐఎంఎఫ్‌ఎల్ డిపోలు, డిస్టిల్లరీలు, బ్రేవరీలు, ఏ4 షాపులు, 2బీ బార్లు 24 గంటల పాటు తెరిచి ఉండవని వివరణ ఇచ్చింది. ఈ నిబంధన ఎక్సైజ్ చట్టాలు, నిబంధనల ప్రకారమేనని వెల్లడించింది. అటు.. 24 గంటల పాటు దుకాణాలు తెరిచి ఉంచే విధానం ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర మెట్రో సిటీల్లో అమల్లో ఉందని తెలిపింది.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్