బీడీ టేకేదార్లకు గుడ్ న్యూస్.. రూ.2 వేల పింఛనుకు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||మంత్రి కేటీఆర్||


బీడీ టేకేదార్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బీడీ కార్మికులకు ఇస్తున్నట్లే బీడీ టేకేదార్లకు కూడా రూ.2 వేల పింఛను అందజేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్యాబినెట్ సమావేశానంతరం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 6 వేల మంది బీడీ టేకేదార్లకు రూ.2 వేల పింఛను అందజేయనున్నట్లు వెల్లడించారు. బీడీ కార్మికుల మాదిరే వీరికి కూడా పెన్షన్ అందుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్