|| బడ్జెట్ ప్రతులతో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావు ||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: 2023-24 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.2.9 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. సభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకుముందు రాష్ట్ర కేబినెట్ సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించింది. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండగా, రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ. 37,525 కోట్లు.