||కేసీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి||
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం గవర్నర్ తమిళిసైకి రాజీనామా లేఖ పంపించి ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌కు వెళ్లిపోయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నా ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నా. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం నిర్వహించి ఫలితాలపై సమీక్ష చేద్దాం. శాసనసభా పక్ష నేతను ఎన్నుకుందాం’ అని అన్నారు. ఎన్నికల ఫలితాలను సమీక్షించిన ఆయన.. ప్రజా తీర్పును ప్రతీ ఒక్కరు గౌరవించాలని అన్నారు.
కేసీఆర్‌ను కలిసివారిలో తాజా మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతీ రాథోడ్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, ఎల్ రమణ, దండె విఠల్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కాలె యాదయ్య, కేపీ వివేకానంద్, పాడి కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డాక్టర్ సంజయ్, సునీతా లక్ష్మారెడ్డి, లాస్యనందిత, చింతా ప్రభాకర్, ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్, గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్జెల నగేశ్ తదితరులు ఉన్నారు. కాగా, గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్‌కు ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక నేత వంటేరు ప్రతాప్ రెడ్డి అందజేశారు.