ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి||

ఈవార్తలు, హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం దరఖాస్తులు అమ్మితే ఊరుకోమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అవసరమైన దరఖాస్తులను అందుబాటులో  ఉంచాలని అధికారులను ఆదేశించిన ఆయన.. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురికావద్దని, పాత లబ్ధిదారులందరికీ యధావిధిగా పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో ఈ పథకాల లబ్ధి పొందనివారు, కొత్తగా లబ్ధి పొందాలనుకొనేవారే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజాస్పందన తదితర వివరాలను రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్