||ప్రతీకాత్మక చిత్రం||
(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి అక్కినేపల్లి పురుషోత్తమరావు)
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలును ఒక్కొక్కటిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. ప్రమాణం స్వీకారం రోజే ఆర్ గ్యారంటీ పై సంతకం చేసిన సీఎం.. అదే రోజు అదే విధంగా మహిళా దివ్యాంగురాలికి ఉపాధి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూలే ప్రజాభవన్ వేదికగా ప్రజా దర్బార్ నిర్వహించగా.. తెలంగాణ ప్రజల నుండి విశేషం స్పందన లభిస్తోంది. మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పరిమితి పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణంపై మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా సీఎం రేవంత్ తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇస్తూ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై నమోదైన కేసులను రద్దు చేయాలని పోలీసు శాఖను ఆదేశించడంతో పాటు జీవో జారీ చేయడం పట్ల తెలంగాణ ఉద్యమ నేతలు, మేధావులు, ప్రజాసంఘాల నేతలు వర్షం రక్తం చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా సీఎం రేవంత్ ప్రజాస్వామిక సుపరిపాలన అందిస్తున్నారన్న సంకేతాలను పంపడంలో సక్సెస్ అయ్యారని రాజకీయ పరిశీలకులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామిక పాలన అందిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ.. ఆ దిశగానే పాలన కొనసాగిస్తోందని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శేషు అన్నారు. నిరంకుశ కుటుంబ పాలన నుండి విముక్తి సాధించిందని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ పేర్కొన్నారు.