||తెలంగాణ ప్రభుత్వం||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్ : యాసంగి వరి ధాన్యంపై రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లు, కార్యాచరణ చేపట్టాలని సీఎస్‌కు స్పష్టం చేశారు. గతంలో మాదిరే 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, కొనుగోళ్లు ప్రారంభించాలని వెల్లడించారు.