నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు అవకాశం.!

తెలంగాణ క్యాబినెట్ సోమవారం భేటీ కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ వన్ లో తెలంగాణ క్యాబినెట్ భేటీ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. ఆర్ఓఆర్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి అనంతరం ఆమోదించనున్నారు. శాసనసభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమవుతోంది.

cabinet Ministers meeting (File photo)

మంత్రిమండలి సమావేశం (ఫైల్ ఫోటో)

తెలంగాణ క్యాబినెట్ సోమవారం భేటీ కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ వన్ లో తెలంగాణ క్యాబినెట్ భేటీ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. ఆర్ఓఆర్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి అనంతరం ఆమోదించనున్నారు. శాసనసభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏ నేపథ్యంలోనే క్యాబినెట్ బేటి ఏర్పాటు చేసి దానికి ఆమోదముద్ర వేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అలాగే ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలను ప్రతిపాదించనుంది. జనాభా నియంత్రణ చేయాలన్న ఉద్దేశంతో గతంలో ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. అయితే గడిచిన కొన్నాళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతుండడంతో దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేసింది. అందులో భాగంగానే పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేసే అంశం పైన క్యాబినెట్ బేటిలో చర్చించే ఆమోదించనున్నారు.

అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా అనేది విధానాలను ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే వీటిపై శాసనసభలో చర్చ నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాసనసభలో చర్చ నిర్వహించే సందర్భంలో ఎవరెవరు మాట్లాడాలనే దానిపైన క్యాబినెట్లో చర్చించనున్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, చతిస్గడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గం పరిశీలించి శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించనుంది. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ పై మంత్రివర్గంలో చర్చించే నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ముఖ్య నాయకుడు ఒకడు తెలిపారు. వీటితోపాటు గడిచిన ఏడాదికాలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజల్లో వచ్చిన సానుకూలత, భవిష్యత్తులో అమలు చేయాలని భావిస్తున్న పథకాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేసిన రుణమాఫీ పథకం తో పాటు మూసి ప్రక్షాళన వంటి పనులకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రతిపక్షాలు చేస్తున్న యాగి వంటి అంశాలను క్యాబినెట్ బేటిలో చర్చించే అవకాశం ఉంది. వీటిపై ముందుకు ఎలా వెళ్లాలని దానిపై చర్చించడంతోపాటు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురద జల్లుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్