దోచుకోవడంపైనే టిడిపి దృష్టి.. ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఏదో ఒక రకంగా నాలుగున్నరేళ్ళపాటు బతికి బట్టకట్టాలని టిడిపి తాపత్రయ పడుతోందని ఎద్దేవా చేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఒకవైపు బిజెపి సిద్ధపడుతోందని, అందుకు అనుగుణమైన సమాచారం వస్తోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

 mp Vijayasai Reddy

ఎంపీ విజయసాయిరెడ్డి 

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఏదో ఒక రకంగా నాలుగున్నరేళ్ళపాటు బతికి బట్టకట్టాలని టిడిపి తాపత్రయ పడుతోందని ఎద్దేవా చేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఒకవైపు బిజెపి సిద్ధపడుతోందని, అందుకు అనుగుణమైన సమాచారం వస్తోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ మూడు ఏళ్లలోనే రాష్ట్రాన్ని దోచుకోవడంలో టిడిపి నిమగ్నమైందా.? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు, రేప్ లు చూసి టిడిపికి ఎందుకు ఓటేసామా.? అని ప్రజలు ఒక్కరి బిక్కిరి అవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తల మధ్య సయోధ్య లేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

అవినీతి దొంగ సొమ్ము వాటాల పంచుకోవడంలో అంతర్గత కుమ్ములాటలతో కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఐదు నెలల పాలనలో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ఆరోపించారు. ఐదు నెలల పాలనలోనే ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మతిమరుపు వ్యాధితో సతమతమవుతున్న చంద్రబాబు.  లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నంలో ఉన్నారా.? అంటూ ప్రశ్నించారు. అరాచకాలకు పాల్పడుతున్న కేడర్, క్రమశిక్షణ లేని ఎమ్మెల్యేలు, మంత్రులు, నిద్ర వస్తలోకి చేజారిన అధికార యంత్రాంగం వల్ల చంద్రబాబు కేంద్రానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారా..? ఆయన ప్రశ్నిస్తూ విజయ సాయి రెడ్డి ట్విట్ చేశారు. ఆదివారం భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన విజయసాయిరెడ్డి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారని, ఈసారి జరిగే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో జమిలి ఎన్నికలకు సంబంధించి వస్తున్న సమాచారాన్ని తెలియజేయడంతోపాటు టిడిపి నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్